దుబాయ్ లో ఫిబ్రవరి 15 నాటికి ఆంక్షలు ఎత్తివేత

- February 10, 2022 , by Maagulf
దుబాయ్ లో ఫిబ్రవరి 15 నాటికి ఆంక్షలు ఎత్తివేత

దుబాయ్: ఎమిరేట్‌లోని అన్ని కోవిడ్ -19 ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నట్లు దుబాయ్ సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. దీంతో ఫిబ్రవరి 15 నాటికి దుబాయ్‌లో అన్ని కార్యకలాపాలు, ఈవెంట్‌లు, సామాజిక సమావేశాలు క్రమంగా పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉంది. కరోనా ముప్పు పోలేదని, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా  ప్రజలు మాస్కులు ధరించడం సహా అన్ని నివారణ చర్యలకు కట్టుబడి ఉండాలని సుప్రీం కమిటీ సూచించింది. బుధవారం దేశంలో 1,538 కొత్త కరోనావైరస్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 862,514, మరణాల సంఖ్య 2,273కు పెరిగాయి. ప్రపంచంలోనే అత్యధిక టీకా రేట్ ను ఎమిరేట్స్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com