భారత్ కొత్త గైడ్‌లైన్స్: క్వారంటైన్ పై కీలక నిర్ణయం
- February 10, 2022
న్యూ ఢిల్లీ: కరోనా మహమ్మారి విషయంలో కేంద్రం కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఉన్న ఎట్ రిస్క్ కంట్రీస్ అనే ఆప్షన్‌ను పక్కన పెట్టింది.అంతే కాదు, విదేశాల నుంచి వచ్చేవారు తప్పని సరిగా ఏడు రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలి. కానీ, ఇకపై ఆ అవసరం లేదు. ఏడు రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆన్లైన్ డిక్లరేషన్ ఫామ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లో రెండు వారాల ట్రావెల్ హిస్టరీ గురించి డీటెయిల్‌గా వివరించాల్సి ఉంటుంది.
ఇక, భారత్ వచ్చిన తరువాత రెండు వారాల పాటు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. ప్రయాణం చేయడానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు లేదా రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా ఆన్లైన్ ఫామ్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్రం నిబంధనల విషయంలో కీలక మార్పులు చేసింది.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు