భారత్ కొత్త గైడ్‌లైన్స్‌: క్వారంటైన్‌ పై కీల‌క నిర్ణ‌యం

- February 10, 2022 , by Maagulf
భారత్ కొత్త గైడ్‌లైన్స్‌: క్వారంటైన్‌ పై కీల‌క నిర్ణ‌యం

న్యూ ఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యంలో కేంద్రం కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఎట్ రిస్క్ కంట్రీస్ అనే ఆప్ష‌న్‌ను ప‌క్క‌న పెట్టింది.అంతే కాదు, విదేశాల నుంచి వ‌చ్చేవారు త‌ప్ప‌ని స‌రిగా ఏడు రోజుల‌పాటు క్వారంటైన్ లో ఉండాలి. కానీ, ఇక‌పై ఆ అవ‌స‌రం లేదు. ఏడు రోజుల‌పాటు త‌ప్ప‌నిస‌రిగా క్వారంటైన్ ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. అయితే, ఆన్‌లైన్ డిక్ల‌రేష‌న్ ఫామ్ సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ ఫామ్‌లో రెండు వారాల ట్రావెల్ హిస్ట‌రీ గురించి డీటెయిల్‌గా వివ‌రించాల్సి ఉంటుంది.

ఇక‌, భార‌త్ వ‌చ్చిన త‌రువాత రెండు వారాల పాటు ఆరోగ్యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ ఉండాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది. ప్ర‌యాణం చేయ‌డానికి 72 గంట‌ల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు లేదా రెండు డోసుల వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఆన్‌లైన్ ఫామ్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో కేంద్రం నిబంధ‌న‌ల విష‌యంలో కీల‌క మార్పులు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com