ఆంధ్ర కళా వేదిక ఖతార్ వారి జాతీయ క్రీడా దినోత్సవ వేడుక
- February 11, 2022
దోహా: అందరిలో క్రీడలను ప్రోత్సహించాలనే ఖతార్ ప్రభుత్వ చొరవలో భాగంగా, “ఆంధ్ర కళా వేదిక” 08-ఫిబ్రవరి-2022 (మంగళవారం) ICC అశోకా హాల్లో “జాతీయ క్రీడా దినోత్సవం” సందర్భంగా "తెలుగింటి ఆటలు" అనే కార్యక్రమాన్ని నిర్వహించింది.డిఫెన్స్ అటాచి ఎంబసీ ఆఫ్ ఇండియా మరియు ISC యొక్క కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ అయినటువంటి కెప్టెన్ మోహన్ అట్ల గారు ఈ వేడుకలలో పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక యొక్క కార్యనిర్వాహక వర్గాన్ని వారితో పాటు పాల్గొన్న వారందరినీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఐసిసి ప్రెసిడెంట్ పిఎన్ బాబు రాజన్, జనరల్ సెక్రటరీ కృష్ణ కుమార్, ఐఎస్సి ప్రెసిడెంట్ డాక్టర్ మోహన్ థామస్ మరియు ఐసిబిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ నాయర్, శ్రీమతి రజనీ మూర్తి, ఐసిసి అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ కెఎస్ ప్రసాద్, వంటి పలువురు ప్రముఖులతో పాటుగా ఇతర ప్రముఖ సంఘాల నాయకులు మహేష్ గౌడ,దీపక్ శెట్టి, ఎల్ఎన్ ముస్తఫా, ఇతర తెలుగు సంఘాల అధ్యక్షులు మరియు వారి కార్యవర్గ బృందం సభ్యులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఉత్సాహవంతంగా మలిచారు.
ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఖతార్ లోని తెలుగు వారి నుండి అపూర్వమైన స్పందన లభించిందని, అందరిలో క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తమ కార్యవర్గ బృందం చేసిన కృషి ఫలించిందని పేర్కొన్నారు. యువతలో మరియు పెద్దలలో క్రీడా స్ఫూర్తిని పునరుజ్జీవింపజేసే మన స్వంత సాంప్రదాయ ఆటలతో ఆంధ్ర కళా వేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన దాతలకు(స్పాన్సర్స్)కి, స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి, ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ రజని గారికి, ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.
పోటీలలో విజేతలుగా నిలిచినవారికి మరియు పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు మరియు బహుమతి వోచర్లు అందజేశారు.హాజరైన వారందరికీ ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన ఫలహారాలు (మొలకలు), పండ్లు & పళ్ళ రసములు అందజేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!