ఖైరతాబాద్ మెట్రో రైల్ స్టేషన్ వద్ద అందుబాటులోకి వచ్చిన దవా దోస్త్ హై ఫ్రీక్వెన్సీ స్టోర్
- February 11, 2022_1644580640.jpg)
హైదరాబాద్:ఎల్ అండ్ డీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్,దవా దోస్త్‌తో భాగస్వామ్యం చేసుకుని జనరిక్ ఔషదాలు మరియు ఇతర ఫార్మా ఉత్పత్తులను హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లలో విక్రయించేందుకు హై ఫ్రీక్వెన్సీ స్టోర్లు (హెచ్‌ఎఫ్‌ఎస్)ను ఏర్పాటుచేయనుంది. దీనిలో భాగంగా మెట్రో రైల్ ప్రాంగణాలలో మొట్టమొదటి దవా దోస్త్ యొక్క హై ఫ్రీక్వెన్సీ స్టోర్‌ను ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైల్ ఉన్నతాధికారులు, ఇతర అతిథులు పాల్గొన్నారు. త్వరలోనే దవా దోస్ట్ కేంద్రాలు అమీర్‌పేట, కెపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, ఎంజీబీఎస్ మొదలైన స్టేషన్‌లలో కూడా ప్రారంభించనున్నారు.
ఖైరతాబాద్‌లో మొట్టమొదటి హై ఫ్రీక్వెన్సీ స్టోర్‌ను ప్రారంభించిన హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రయాణీకులతో పాటుగా సందర్శకులకు ఇది సంతోషకరమైన సమాచారం. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద దవా దోస్త్ పేరిట తక్కువ ధరలలో మందులను అందించే స్టోర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ప్రయాణీకులు అత్యంత సౌకర్యవంతంగా జనరిక్ మందులు, ఇతర ఔషద ఉత్పత్తులను ఆకర్షణీయమైన రీతిలో 15నుంచి 80% వరకూ రాయితీలలో పొందగలరు’’ అని అన్నారు.
ఎల్ అండ్ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ అండ్ సీఈవో శ్రీ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘ హైదరాబాద్ మెట్రో రైల్ వద్ద దవా దోస్త్‌ను స్వాగతిస్తున్నాము. ఖైరతాబాద్ వద్ద వచ్చిన ఈ స్టోర్‌తో రాయితీ ధరలలో ప్రయాణీకులు ఔషదాలు పొందగలరు’’ అని అన్నారు.
దవాదోస్త్ సీఈవో అమిత్‌చౌదరి మాట్లాడుతూ ‘‘ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద దవా దోస్త్ ప్రారంభించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాము.హైదరాబాద్ స్థానిక కమ్యూనిటీలో భాగం కావడం పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’అని అన్నారు.
దవా దోస్త్ ప్రారంభంతో ప్రయాణీకులు జనరిక్ మందులు మరియు ఇతర ఫార్మసీ ఉత్పత్తులపై 80% వరకూ ఆదా చేయవచ్చు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!