దుబాయ్ ఎక్స్పో-2020: ఏపీ పెవిలియన్ ప్రారంభం

- February 12, 2022 , by Maagulf
దుబాయ్ ఎక్స్పో-2020: ఏపీ పెవిలియన్ ప్రారంభం

దుబాయ్: ఇండియన్ పెవిలియన్ భవంతిలో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ను ప్రారంభించిన ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

పెవిలియన్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన యూఏఈ విదేశాంగశాఖ మంత్రి  తనిబిన్ అహ్మద్ ఆల్ జియాది.ఇండియాలో యూఏఈ అంబాసిడర్ అహ్మద్ అబ్దుల్ రెహమాన్ యూఏఈలో భారత దౌత్యాధికారి సంజయ్ సుధీర్, రాష్ట్ర విదేశీ పెట్టుబడుల సలహాదారు జుల్ఫీ తదితరులు పాల్గొన్నారు.

పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల వాతావరణం, ప్రత్యేకతలు, సానుకూల అంశాలతో పెవిలియన్ ఏవీ(ఆడియో విజువల్)ల రూపకల్పన.పెవిలియన్ లో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, ఫిషింగ్ హార్బర్లు, విద్య, వైద్యం, పర్యాటకం, ఐ.టీ,పోర్టులు సహా పలు రంగాలపై నిరంతర ఏవీలు ప్రదర్శించారు.

12 స్క్రీన్ ల ద్వారా  కీలక రంగాలకు సంబంధించిన అంశాలకు సంబంధించిన ఏవీల ప్రదర్శన గురించి వివరించిన ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది.పెవిలియన్ లోని దృశ్యాలకు తగ్గట్లు ఆకర్షించే నేపథ్య సంగీతం,ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వీడియోల తయారీని ఆసక్తిగా తిలకించిన యూఏఈ ప్రతినిధులు.

అనంతరం ఇండియన్ పెవిలియన్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న స్పేస్, యోగా, గ్రీన్ హౌస్ ల మీదుగా వీఐపీ లాంజ్ కి వెళ్ళిన మంత్రి మేకపాటి నేతృత్వంలోని బృందం.యూఏఈ విదేశాంగశాఖ మంత్రి తనిబిన్ అహ్మద్ ఆల్ జియాది చేతుల మీదుగా "పెట్టుబడులు ప్రాజెక్టుల" సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో  ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి,రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం, ఏపీ మారిటైమ్ డిప్యూటీ సీఈవో రవి, ఏపీ ఈడీబీ, ఏపీఐఐసీ, పరిశ్రమలశాఖ అధికారులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com