'మేముసైతం' టెలివిజన్‌ షో

- March 29, 2016 , by Maagulf
'మేముసైతం' టెలివిజన్‌ షో

'మంచి' చేయడానికి హీరోలు వెనకడుగేస్తున్నారు... మంచి కోసం మన హీరోయిన్లు అడిగిన వెంటనే ఓకే అని సిద్ధమవుతున్నారు. హీరోలు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు..  లక్ష్మీప్రసన్న''మనవల్ల మరొకరి జీవితం నిలబ డుతుందనకున్నప్పుడు వీలైనంతగా సాయం చేయడం మనిషిగా మన విధి. అలాంటి కార్యక్రమమే మేము చేస్తున్న 'మేము సైతం'. ఈ కార్యక్రమంలో పాల్గొనమని మన తెలుగు హీరోహీరోయిన్లందరినీ అడిగాను. హీరోయిన్లు స్పందించినంతగా కూడా హీరోలు స్పందించడం లేదు. ఈ విషయంలో బాలీవుడ్‌ హీరోలు చాలా చాలా బెటర్‌...''అని అన్నారు నటి, నిర్మాత లక్ష్మీమంచు.ఆమె హోస్ట్‌గా రూపుదిద్దుకుంటున్న 'మేముసైతం' టెలివిజన్‌ షో గురించి తెలియజేయడానికి బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఓ సమావేశం ఏర్పాటుచేశారు. నటులు సుశాంత్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో పాటుగా నిర్మాత జెమినీ కిరణ్‌, జెమినీటీవీ బిజినెస్‌ హెడ్‌ సుబ్రహ్మణ్యం, నార్త్‌ రీజియన్‌ హెడ్‌ కాశీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ''మేము సైతం కాన్సెప్ట్‌ రెండేళ్ల క్రితం నా మదిలో వచ్చిన ఆలోచన. అయితే దానిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలియలేదు. సరిగ్గా ఆరు నెలల క్రితం కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తనయురాలు శ్రుతి షిండే ఈ కాన్సెప్ట్‌ గురించి నా దగ్గర డిస్కస్‌ చేయడంతో దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాను. హిందీలో 'మిషన్‌ సప్నే' పేరిట ఈ కార్యక్రమం ఆమె రూపొందిస్తున్నారు. ఏప్రిల్‌ 2 నుంచి ప్రతి శనివారం ప్రసారమయ్యే ఈ షో చూసిన తరువాత అయినా హీరోలు స్పందిస్తారని ఆశిస్తున్నాను .మొత్తం 26 భాగాలుగా ఈ షో చేయనున్నాం. నీడీ పీపుల్‌ కోసం స్టార్స్‌ రియల్‌గా కష్టపడటమే ఈ షో'' అని అన్నారు.రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ '' క్యాన్సర్‌ బాధిత చిన్నారి కోసం కూరగాయలు అమ్మాను'' అని అన్నారు. -

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com