2,754 లిక్కర్ బాటిళ్లు స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్
- February 13, 2022
కువైట్: ఐరోపా దేశం నుంచి విదేశీ లిక్కర్ ని దిగుమతి చేసుకుంటున్న ఐదుగురు నిందితులను క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అరెస్టు చేసింది. వారి వద్ద ఉన్న 2,754 లిక్కర్ బాటిళ్లు, కిలో హషీష్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూరోపియన్ దేశం నుండి దేశంలోకి దిగుమతి చేసుకున్న లిక్కర్ ను తీసుకురావడానికి ఒక సిటిజన్ ప్రయత్నించగా.. సమాచారం అందుకున్న అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అతడిచ్చిన సమాచారం మేరకు అమ్ఘరా ప్రాంతంలోని గోదాములో దాచిన సుమారు 2,754 దిగుమతి చేసుకున్న లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా లిక్కర్ అక్రమ రవాణాలో భాగమైన మిగతా ముఠా సభ్యులను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిలో అరబ్ జాతీయలు కూడా ఉన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ 200 వేల దినార్లుగా అధికారులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







