భారత్ కరోనా అప్డేట్

- February 13, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు భారీ సంఖ్యలో తగ్గుతూ వస్తున్నాయి.50వేల దిగువకు పడిపోయాయి రోజువారి కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,877 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి, మరో 684 మంది కోవిడ్‌ బాధితులు కన్నుమూశారు.ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 6 లక్షల దిగువకు పడిపోయి 5,37,045కు చేరింది.రోజు వారీ పాజిటివిటీ రేటు 3.48 శాతం నుంచి 3.17 శాతానికి పడిపోయినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ఇక, ఒకేరోజులో 1,17,591 మంది కోవిడ్‌ నుంచి కోలుకోవడంతో.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నారి సంఖ్య 4,15,85,711కి చేరింది.. దీంతో దేశం రికవరీ రేటు 97.55 శాతానికి చేరుకుంది.

కాగా, భారత్‌లో ఆగస్టు 7, 2020న 20 లక్షల మార్క్‌ను దాటాయి కోవిడ్‌ కేసులు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షల మార్క్‌లు క్రాస్‌ చేయగా.. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు దాటింది. అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. ఇక, గత ఏడాది మే 4న రెండు కోట్లు, జూన్ 23న మూడు కోట్ల మైలురాయిని అధిగమించాయి కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com