అక్రమ నివాసితులకోసం దుబాయ్‌లో భవనం
- March 30, 2016
దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) 16,731 చదరపు మీటర్ల పరిధిలో డిటెన్షన్ సెంటర్‌ని నిర్మిస్తోంది. యూఏఈలో అక్రమంగా నివసిస్తున్నవారిని గుర్తించి, తరలించేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. జిడిఆర్ఎఫ్ఎ మేజర్ జనరల్ ఒబైద్ మొహైర్ బిన్ సురూర్ మాట్లాడుతూ, అల్ అవీర్‌లోని ఈ కొత్త బిల్డింగ్, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మింపబడ్తున్నట్లు చెప్పారు. అక్రమ నివాసితులకు తాత్కాలికంగా ఇక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చేస్తామనీ, వారి రెసిడెన్షియల్ స్టేటస్ రెగ్యులర్ అయ్యేదాకా లేదంటే యూఏఈని వారు విచిపెట్టేదాకా ఉండేందుకు ఈ భవనం ఉపయోగపడ్తుందని వివరించారు. భవన నిర్మాణ ప్రాంతాన్ని కల్నల్ అహ్మద్ ఖలాఫ్ అల్ ఘాయిత్తో కలిసి సందర్శించారు సురూర్. భవన నిర్మాణ పనుల్ని ఆయన సమీక్షించారు. 2017 నాటికి ఈ భవనం పూర్తి కానుంది. ప్లే గ్రౌండ్, నర్సరీ, సూపర్ మార్కెట్ అందుబాటులో ఉంటాయి. ఒక్కో రూమ్‌లో నలుగురు నివాసం ఉండేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. మహిళలకు ప్రత్యేకంగా సెక్షన్ ఉంటుంది. ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి ఏర్పాట్లు, అక్రమ నివాసితులకు తమ కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులకు సమాచారం అందించేందుకోసం ఉపయోగపడనున్నాయి. తమ వస్తువుల్ని భద్రపర్చుకునేందుకు లాకర్స్‌ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక వైద్య సౌకర్యాలతో కూడిన జనరల్ క్లినిక్, డెంటిస్ట్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అక్రమ నివాసితులు క్రిమినల్స్ కాదనీ, అనుకోని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిని ఆదుకునేందుకే ఈ భవన నిర్మాణం చేపట్టామని అన్నారు. దుబాయ్ మునిసిపాలిటీ సహకారంతో ఈ భవన నిర్మాణం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









