100 కిసాన్ డ్రోన్ల ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- February 19, 2022
న్యూఢిల్లీ: పంట పొలాల్లో పురుగుల మందులు పిచికారీ చేసేందుకు మోడీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేసేందుకు 100 కిసాన్ డ్రోన్ లను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. వివిధ నగరాల్లో, పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు పంట సాగులో పనులు సులభతరం అయ్యేందుకు చర్యలు చేపట్టింది మోడీ సర్కార్. రైతులకు సహాయం చేసే విధంగా ప్రత్యేక డ్రైవ్లో దేశ వ్యాప్తంగా పొలాల్లో పురుగులమందును పిచికారీ చేయడానికి వివిధ నగరాలు, పట్టణాలలో వంద కిసాన్ డ్రోన్లను ప్రారంభించారు మోడీ. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో గరుడు ఏరోస్పెస్ కింద లక్ష మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లను తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
ఇది యువతకు కొత్త ఉపాధి, కొత్త అవకాశాలను తీసుకువస్తుందని అన్నారు. 21వ శతాబ్దపు ఆధునిక వ్యవసాయ సౌకర్యాల దిశలో ఇది కొత్త అధ్యాయం అని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో అపరిమిత అవకాశాలు వస్తాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డ్రోన్ల ద్వారా రైతులకు ఎంతో సహకారంగా ఉంటుందని భావిస్తున్నట్లు మోడీ అన్నారు. 2022-23 వార్షిక బడ్జెట్లో దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేసే బడ్జెట్ కేటాయించినట్లు పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా రైతులకు డిజిటల్, హైటెక్ టెక్నాలజీని అందించడానికి కేంద్రం కిసాన్ డ్రోన్లు, రసాయన రహిత సహజ వ్యవసాయం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతామాన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలిపారని మోడీ అన్నారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగుమందులు, పోషకాలను పిచికారీ చేయడం కోసం కిసాన్ డ్రోన్లను ప్రోత్సహిస్తామని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు