వ్యాక్సినేషన్ పూర్తయినవారికి కోవిడ్ పిసిఆర్ టెస్ట్ అవసరం లేదన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్

- February 19, 2022 , by Maagulf
వ్యాక్సినేషన్ పూర్తయినవారికి కోవిడ్ పిసిఆర్ టెస్ట్ అవసరం లేదన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్

యూఏఈ: యూఏఈ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే, వారికి ముందస్తుగా కోవిడ్ పీసీఆర్ టెస్ట్ అవసరం లేదని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన ట్రావెల్ అప్‌డేట్‌లో పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఇండియాలో వ్యాక్సినేషన్ పొందినవారికే ఈ వెసులుబాటు కల్పించారు. ఎయిర్ సువిధ పోర్టల్ ద్వారా ప్రయాణీకులు తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చెయ్యాల్సి వుంటుంది. కాగా, యూఏఈలో వ్యాక్సినేషన్ తీసుకున్నవారు మాత్రం 72 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ తమతోపాటు తీసుకురావాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com