భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

- February 21, 2022 , by Maagulf
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న “భీమ్లా నాయక్”లో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈరోజు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాల్సి ఉంది. సాయంత్రం 8 గంటలకు ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నట్టుగా చెప్పడంతో మెగా అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే అందరికీ షాకిస్తూ తాజాగా ‘భీమ్లా నాయక్’ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.

“ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి. ఆయన మృతికి గౌరవ సూచకంగా భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగదు” అంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. దీంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా నిరాశపడిపోయారు. తరువాతైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా? ట్రైలర్ సంగతేంటి ? అంటూ ప్రశ్నిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com