టీటీడీ తీరు మరీ సంతలో పశువుల వేలంలా ఉందే!!
- February 23, 2022
తిరుమల: ‘సామాన్య భక్తులకు సంబంధించి ఎలాంటి ధరల పెంపు లేదు.. సీఫారసు లేఖల ద్వారా వచ్చేవారికి మాత్రమే సేవల ధరల పెంపు..’ అంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
ఈ విషయమై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ కూడా ఇచ్చారు. అయితే, అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.
టీటీడీ పాలక మండలి సభ్యుల సమావేశానికి సంబంధించి ఓ వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. అందులో, సభ్యులు మాట్లాడుతున్న తీరు అత్యంత దారుణంగా వుందంటూ భక్తులు వాపోతున్నారు. 400 టిక్కెట్ ధర ‘వై’ 800? 2500 చేసెయ్.. అంటూ వైవీ సుబ్బారెడ్డి చెప్పడం అందులో కనిపిస్తోంది.
ఇంకో సేవ ధరని ఏకంగా పది వేలకు పెంచేయాలంటూ మరో సభ్యుడు ప్రతిపాదిస్తున్నాడు. సంతలో పశువుల వేలం కూడా ఇలా జగదేమో.. అన్నది సగటు భక్తుడి వాదన.
నిజానికి, టీటీడీ చుట్టూ వివాదాలు తెరపైకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూశాయి. ఈసారి మరింత దారుణం.. అంతే. టీటీడీ తీసుకునే నిర్ణయాల వెనుక ప్రభుత్వ ప్రమేయం నేరుగా వుండకపోయినా, ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల ఆలోచనలే అక్కడ ప్రతిబింబిస్తాయనే బలమైన అభిప్రాయం ప్రజల్లో వుంది. అందులో నిజం లేకపోలేదు కూడా.
అలిపిరి టోల్‌గేట్ ఛార్జీల పెంపు దగ్గర్నుంచి, లడ్డూ ధరల పెంపు, అద్దె గదుల రేట్ల పెంపు.. చెప్పుకుంటూ పోతే కథ చాలానే వుంది. కోవిడ్ నేపథ్యంలో టీటీడీకి ఆదాయం తగ్గిన మాట వాస్తవం. అలాగని, భక్తిని వ్యాపర వస్తువుగా మార్చేస్తే ఎలా.?
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం