ఖతార్ లో మార్చి 31 వరకు గ్రేస్ పీరియడ్ పొడిగింపు
- February 25, 2022
ఖతార్: ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లను నియంత్రించే చట్టం నంబర్ 21/2015ను ఉల్లంఘించిన ప్రవాసుల చట్టబద్ధ స్థితిని సరిదిద్దడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ మార్చి31 వరకు గ్రేస్ పీరియడ్‌ని పొడిగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మరోసారి రిమైండర్‌ను జారీ చేసింది. ఉల్లంఘన పరిష్కార మొత్తంలో 50% తగ్గింపు నిచ్చారు. ఈ అవకాశాన్ని వ్యాపార యజమానులు, కార్మికులు వినియోగించుకోవాలని సూచించింది. ఉల్లంఘనల పరిష్కారం కోసం ఫాలో-అప్ విభాగానికి లేదా ఉమ్ సలాల్, అల్ రయ్యాన్, మెసైమీర్, అల్ వక్రా, ఉమ్ సునైమ్లోని సేవా కేంద్రాలను సందర్శించాలని కోరింది. ఈ గ్రేస్ పీరియడ్ నుండి రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసులు (కంపెనీలు), వర్క్ వీసా నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసులు లాభం పొందవచ్చని మినిస్ట్రీ అధికారులు పేర్కొన్నారు. యజమానులు, ప్రవాసులు తమ స్థితిని చట్టబద్ధం చేసుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







