తెలంగాణ విద్యార్థులను ఆదుకోండి.. ప్రయాణ ఖర్చులు భరిస్తామన్న కేటీఆర్
- February 25, 2022హైదరాబాద్: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పూర్తి ప్రయాణ ఖర్చులను భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌లోని తెలంగాణ విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, రాష్ట్ర సచివాలయంలో హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సంప్రదింపులు జరుపుతున్నారు. హెల్ప్ లైన్ సెంటర్లకు రాత్రి నుంచి ఇప్పటి వరకు 75 ఫోన్ కాల్స్ వచ్చినట్లు సీఎస్ వెల్లడించారు. తెలంగాణ విద్యార్థులకు అవసరమైన భరోసా ఇస్తున్నామని తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్ లైన్ నంబర్ – 70425 66955, 99493 51270, 96456 63661
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ