తెలంగాణ విద్యార్థులను ఆదుకోండి.. ప్రయాణ ఖర్చులు భరిస్తామన్న కేటీఆర్
- February 25, 2022
హైదరాబాద్: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పూర్తి ప్రయాణ ఖర్చులను భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌లోని తెలంగాణ విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, రాష్ట్ర సచివాలయంలో హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సంప్రదింపులు జరుపుతున్నారు. హెల్ప్ లైన్ సెంటర్లకు రాత్రి నుంచి ఇప్పటి వరకు 75 ఫోన్ కాల్స్ వచ్చినట్లు సీఎస్ వెల్లడించారు. తెలంగాణ విద్యార్థులకు అవసరమైన భరోసా ఇస్తున్నామని తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్ లైన్ నంబర్ – 70425 66955, 99493 51270, 96456 63661
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్‌వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్‌లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు