నైట్ కర్ఫ్యూను ఎత్తివేసిన దేశ రాజధాని
- February 25, 2022
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. దీంతో కోవిడ్ ఆంక్షలను సడలించింది కేజ్రీవాల్ సర్కార్. కరోనా కట్టడికి విధించిన నైట్ కర్ఫ్యూను ఎత్తివేసింది ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ. గతంలో మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా విధించేవారు.ఇప్పుడు దాన్ని 500 వరకు తగ్గించింది. నైట్ కర్ఫ్యూ ఎత్తివేయడంతో దుకాణాలు, రెస్టారెంట్లు, అర్థరాత్రి వరకు తెరిచి ఉంటాయి. అలాగే ఏప్రిల్ 1 నుంచి పాఠశాలలు పూర్తిగా తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. స్కూల్స్ లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించుకోవచ్చని చెప్పారు. అంతేకాదు బస్సులు, మెట్రో రైళ్లలో విధించిన నిబంధనలను సడలించిందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







