హర్రర్ సినిమాలో మిల్కీ బ్యూటి..

- March 31, 2016 , by Maagulf
హర్రర్ సినిమాలో మిల్కీ బ్యూటి..

కెరీర్ ముగిసిపోయిందనుకున్న సమయంలో బాహుబలి సినిమాతో ఒక్కసారి ఫాంలోకి వచ్చింది మిల్కీ బ్యూటి తమన్నా. బాహుబలి సినిమాలో అవంతికగా నేషనల్ లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి తన కెరీర్ లోనే తొలిసారిగా ఓ హార్రర్ సినిమాలో నటించడానికి రెడీ అవుతోంది. లాంగ్ గ్యాప్ తరువాత డ్యాన్సింగ్ స్టార్ ప్రభుదేవ ఈ సినిమాతో హీరోగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హర్రర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపధ్యంలో తమన్నా లీడ్ రోల్ లో అభినేత్రి పేరుతో ఓ హర్రర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సోనూసూద్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ వర్షన్ ను ప్రభుదేవా నిర్మిస్తుండగా, తెలుగు వర్షన్ ను కోనవెంకట్ నిర్మిస్తున్నారు. ఇన్నాళ్లు తన గ్లామర్ తో ఆకట్టుకున్న తమన్నా హర్రర్ సినిమాలో ఎంతో వరకు మెప్పింస్తుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com