పవిత్ర మసీదుల్లోకి 7 ఏళ్లు పైబడినవారికి అనుమతి
- February 26, 2022
సౌదీ: 7 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇప్పుడు రెండు పవిత్ర మసీదుల్లోకి ప్రవేశించడానికి అనుమతిని పొందవచ్చని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు తవక్కల్నా అప్లికేషన్ లో వారి ఆరోగ్య స్థితిని "ఇమ్యూన్"గా అప్డేట్ చేశారు. సౌదీ అరేబియాలో ఎవరైనా ఉమ్రా చేయాలనుకునే వారు యాప్‌లోని వారి ఆరోగ్య స్థితి “ఇమ్యూన్” అనే షరతుపై “ఈట్మార్నా” లేదా “తవక్కల్నా” అప్లికేషన్ల నుండి అనుమతి పొందవలసి ఉంటుందన్నారు. లబ్ధిదారుల డేటా తప్పనిసరిగా అప్డేట్ చేయాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్రాకు ప్రతి 10 రోజులకు ఒకసారి అనుమతులు జారీ చేయబడతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో ఈ ఏర్పాటు కొనసాగుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని, ఏవైనా అప్డేడ్ ఉంటే తగిన సమయంలో ప్రకటిస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం