1 రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్.. సేవలు ప్రారంభించిన చిన జీయర్ స్వామి

- February 26, 2022 , by Maagulf
1 రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్.. సేవలు ప్రారంభించిన చిన జీయర్ స్వామి

హైదరాబాద్: ఆరోగ్యం.. ఆహారం లేకుండా అసలు జీవితమే లేదని త్రిదండి పీఠాధిపధి చిన జీయర్ స్వామి సెలవిచ్చారు. అనారోగ్యాల కోసం జనం భారీ ఎత్తున డబ్బులు ఖర్చుపెడుతోన్న ప్రస్తుత కాలంలో అతి తక్కువ ధరకే మెరుగైన వైద్యసేవలు అందిస్తోన్న సీజీ ఛారిటీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అక్కడ ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్ సేవలను జీయర్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని రామ్ నగర్ ప్రాంతంలో గల సీజీ చారిటీ ఆస్పత్రిలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

డాక్టర్ గంగాధర్ గుప్తా ఆధ్వర్యంలో హైదరాబాద్ రామ్ నగర్​లో కొనసాగుతున్న సీజీ ఛారిటీ ఆస్పత్రిని చిన జీయర్ సందర్శించారు. ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్ వైద్య సేవలు ప్రారంభించారు.పేద, ధనిక, కుల, మత భేదం లేకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు... అతి తక్కువ ధరలో వైద్యాన్ని అందించడం ప్రశంసనీయమని జీయర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీజే ఛారిటీ ఆస్పత్రి నిర్వాహకులు.. చిన్నజీయర్ స్వామికి పాదపూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com