మజ్జిగతో బోలెడు లాభాలు..

- February 27, 2022 , by Maagulf
మజ్జిగతో బోలెడు లాభాలు..

మజ్జిగను ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు. కేవలం వేసవి కాలం లో మాత్రమే తీసుకోవాలనే ఆలోచన జారింది కాదు.. మజ్జిగలో సోడియం , క్యాల్షియం మూలకాలు మెండుగా ఉంటాయి.. వీటితో పాటు ప్రోటీన్స్, మినరల్స్ కూడా ఉంటాయి.. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని , పోషకాలను అందిస్తాయి.

మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలోనే కొలెస్ట్రాల్ స్థాయి , తగ్గుముఖం పడుతుంది.. అలాగే రక్తపోటు నియంత్రణ లో ఉంటుంది.ఎముకలకు కావాల్సిన బలాన్ని ఇసుతుంది.. మజ్జిగ శరీరంలో పేరుకు పోయిన మలినాలను బయటకు పంపుతుంది. అలాగే జీవ క్రియ రేటును పెంచి బరువు నియంత్రణ కు తోడ్పడుతుంది. తీసుకున్న ఆహారం జీర్ణం కావటానికి సాయపడుతుంది. అజీర్తి, అసిడిటీ సమస్యలను తగ్గించి రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు. రోజూ ఉదయం మజ్జిగ తీసుకుంటే ఫలితం ఉంటుంది. పైల్స్ సమస్యతో ఉన్నవారు గ్లాసు మజ్జిగలో అరా చెంచా సొంఠి పొడిని వేసుకుని తాగితే ఈ ఇబ్బంది నుంచి ఉపశమనం లభిస్తుంది.

పాలు పడని వారు, మధుమేహులు , ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకోవచ్చు. వేయించిన జీల కర్ర , ధనియాల పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే చలువ చేయటం తో పాటు వాతం ,కఫము వాటి సమస్యలు తగ్గుతాయి. మజ్జిగలో కాస్తంత సొంఠి పొడి వేసి తాగితే ఆకలి పెరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com