భారత్ కరోనా అప్డేట్
- February 28, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గింది.తాజా బులెటిన్ ప్రకారం కొత్త కేసులు 10 వేల దిగవకు పడిపోయాయి.గత బులెటిన్‌లో 10 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,013 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరోవైపు మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.. ఒకేరోజులో 119 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.పాజిటివిటీ రేటు 1.11 శాతానికి పడిపోయినట్టు ప్రభుత్వం పేర్కొంది.
ఇక, కోవిడ్ నుంచి మరో 16,765 మంది కోలుకున్నారు.దీంతో మొత్తం రికవరీ కేసుల సంఖ్య 4,23,07,686కు చేరుకోగా.. ఇప్పటి వరకు కోవిడ్‌తో 5,13,843 మంది మృతి చెందారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,02,601 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు.. కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది.ఆదివారం మరో 4,90,321 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేయడంతో.. మొత్తం ఇప్పటి వరకు 1,77,50,86,335 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్రం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు..!!
- మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- కువైట్ లో 28వేల మందిపై బహిష్కరణ వేటు..!!
- గ్లోబర్ స్పేస్ ఇండస్ట్రీకి రీజినల్ హబ్ గా ఒమన్..!!
- ఏ వీసా ఉన్నా ఉమ్రా చేయవచ్చు: హజ్ మంత్రిత్వ శాఖ
- దుబాయ్‌లో ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల కోసం కొత్త చట్టం..!!
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..
- గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక