కువైట్ లోని భారతీయులకు మరింత మెరుగైన సేవలు!

- February 28, 2022 , by Maagulf
కువైట్ లోని భారతీయులకు మరింత మెరుగైన సేవలు!

కువైట్ సిటీ: కువైట్ లోని భారతీయులకు మరోమూడు పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి.కువైట్ సిటీ, ఫహాహీల్, అబ్బాసియా ప్రాంతాల్లో ఈ సెంటర్లు ఏర్పాటయ్యాయి.బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సహకారంతో భారత రాయబార కార్యాలయం  నెలకొల్పిన ఈ సెంటర్లను తాజాగా కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జి ప్రారంభించారు.ఈ మూడు సెంటర్ల ద్వారా ఏటా సుమారు రెండు లక్షల అప్లికేషన్లను ప్రాసెస్ చేయవచ్చని ఈ సందర్భంగా ఆయన అంచనా వేశారు.కువైట్ లోని భారతీయులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే ఉద్దేశంతో ఈ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.ఈ కేంద్రాలు దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం ఫోటోకాపీ చేయడం, డాక్యుమెంట్ ప్రింటింగ్, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫోటోగ్రఫీ, కొరియర్ డెలివరీ, ఫారమ్ ఫిల్లింగ్ మరియు ఇంగ్లీష్/అరబిక్ టైపింగ్ వంటి అదనపు సేవలను అందిస్తాయి.ఈ సౌకర్యాల కారణంగా మొత్తం అప్లికేషన్ ప్రాసెసింగ్ సమయం క్రమబద్ధీకరించబడింది మరియు తగ్గించబడింది.దరఖాస్తుదారులు ఈ కేంద్రాలలో వాణిజ్య, వ్యక్తిగత మరియు విద్యా పత్రాల ధృవీకరణను కూడా పొందవచ్చు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com