సరికొత్తగా.. పీసీఆర్ టెస్టింగ్, ఐసోలేషన్ రూల్స్.!
- February 28, 2022
యూఏఈ: యూఏఈలో అథారిటీస్, కోవిడ్ సేఫ్టీకి సంబంధించి తాజా రూల్స్ విడుదల చేయడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం ఆప్షనల్ చేశారు. అయితే ఇండోర్ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి. కోవిడ్ పాజిటివ్ కేసులతో క్లోజ్ కాంటాక్ట్‌లో వున్నవారికి సంబంధించి వెసులుబాట్లు కల్పించారు. ఇకపై వారికి క్వారంటైన్ అవసరం లేదు. అయితే, ఐదు రోజులపాటు ప్రతిరోజూ వారు పీసీఆర్ టెస్టింగ్ చేయించుకోవాల్సి వుంటుంది. పీసీఆర్ టెస్టింగ్ విషయమై ఆయా ఎమిరేట్స్ ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అబుదాబీలో క్లోజ్ కాంటాక్టులకు క్వారంటైన్ అవసరం లేదు, ప్రతిరోజూ పీసీఆర్ టెస్ట్ ఐదు రోజులపాటు చేయించుకోవాలి. దుబాయ్ విషయానికొస్తే, లక్షణాలు లేని క్లోజ్ కాంటాక్ట్స్ క్వారంటైన్లో వుండాల్సిన అవసరం లేదు. పీసీఆర్ టెస్టులపై ప్రత్యేక నిర్ణయాలేమీ లేవు. కోవిడ్ పాజిటివ్ కేసుల విషయానికొస్తే, ఐసోలేషన్ ప్రోటోకాల్‌లో మార్పులు చేయలేదు. అయితే వారు చేతి బ్యాండ్స్ ధరించాల్సిన అవసరం లేదు. దుబాయ్‌లో ఐసోలేషన్ 10 రోజులు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







