ఎక్స్‌పో 2020 దుబాయ్: ఉచిత సీజన్ పాసుల్ని ప్రకటించిన యూఏఈ ఎయిర్ లైన్స్

- February 28, 2022 , by Maagulf
ఎక్స్‌పో 2020 దుబాయ్: ఉచిత సీజన్ పాసుల్ని ప్రకటించిన యూఏఈ ఎయిర్ లైన్స్

దుబాయ్: మరో నెల రోజుల్లో ఎక్స్‌పో 2020 దుబాయ్ ముగియనున్న దరిమిలా, నిర్వాహకులు ఎయిర్ లైన్స్ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు మరిన్ని ఆఫర్స్ ప్రకటిస్తుండడం జరుగుతోంది. మార్చి 31 వరకు సీజన్ పాస్ ఫినాలె అందులో ఒకటి. దీని ద్వారా ఎన్నిసార్లైనా ఎక్స్‌పో దుబాయ్ 2020 సందర్శించవచ్చు. దీనికోసం 50 దిర్హాములు చెల్లిస్తే సరిపోతుంది. కాగా, యూఏఈ ఎయిర్ లైన్ సంస్థలు సీజన్ పాసుల్ని ప్రయాణీకులకు ఆఫర్ చేస్తున్నాయి. ఉచిత డే పాసుల్ని తమ ప్రయాణీకులకు ఎమిరేట్స్ సంస్థ ప్రకటించింది. కాంప్లిమెంటరీ సింగిల్ డే పాస్.. ఇప్పుడు సీజన్ పాస్‌గా మారిందని సంస్థ పేర్కొంది. అబుదాబీ విమానాశ్రయం నుంచి కేవలం 45 నిమిషాల్లో ఎక్స్‌పో ప్రాంతానికి చేరుకోవచ్చని ఎతిహాద్ ఎయిర్ వేస్ పేర్కొంది. ఫ్లై దుబాయ్ వంటి సంస్థలు కూడా ఇవే తరహా ఆఫర్లను అందిస్తున్నాయి.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com