దుబాయ్లో ఇద్దరు ఆఫ్రికన్లకు 3 ఏళ్ళ జైలు శిక్ష
- March 02, 2022
దుబాయ్: హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలపై దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఇద్దరు ఆఫ్రికన్లకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. UAE కుటుంబానికి పనిమనిషిగా ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి దుబాయ్ కి తీసుకొచ్చి అనైతిక కార్యకలాపాలకు పాల్పడేందుకు వీలుగా తనను బంధించారని గత జూన్లో ఒక ఆఫ్రికన్ అమ్మాయి పెట్రోలింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. తనను ఆఫ్రికన్ వ్యక్తులు నిర్బంధించడమే కాకుండా.. తనపై అత్యాచారం చేసి, అసభ్యకరమైన కార్యకలాపాలు చేసేందుకు బలవంతం చేశారని ఫిర్యాదులో చెప్పింది. Dhs 20,000 చెల్లించే వరకు తాము చెప్పిన పని చేయాలంటూ బలవంతం చేశారని పోలీసుల ఎదుట బాధితురాలు వాపోయింది. ఈ క్రమంలో అనారోగ్యం పేరిట తప్పించుకొని తనకు తెలిసిన ఓ వ్యక్తి దగ్గర ఆశ్రయం పొందింది. అతడు ఆమె పాస్ పోర్ట్ కోసం ముఠా సభ్యులను ప్రశ్నించగా.. సదరు వ్యక్తిని బంధించి చిత్రహింసలు పెట్టి బాధితురాలు ఉన్న అడ్రస్ ని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలిని ముఠా సభ్యులు తరలించే క్రమంలో పెట్రోలింగ్ సిబ్బందిని చూసి చూసి సహాయం కోసం అరవడంతో భయంతో ముఠా సభ్యులు అక్కడి నుంచి పారిపోతుండగా.. పోలీసులు పట్టుకొని విచారించడంతో జరిగిన ఘోరం బయటకు వచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …