రెండోసారి బిగ్ టిక్కెట్ విజేతగా సైదాలి కన్నన్
- March 03, 2022
యూఏఈ: సైదాలి కన్నన్ రెండోసారి బిగ్ టికెట్ వీక్లీ ఎలక్ట్రానిక్ డ్రా విజేతగా నిలిచారు. అబుధాబిలో సైదాలి అనే ప్రైవేట్ చెఫ్ గత 24 సంవత్సరాలుగా బిగ్ టిక్కెట్‌లను కొంటున్నారు. అతను మొదటి సారిగా 1998లో బిగ్ టిక్కెట్‌తో నగదు బహుమతిని గెలుచుకున్నాడు. గత 24 సంవత్సరాలుగా నమ్మకంతో టిక్కెట్ కొంటున్నాడు. మళ్లీ 2022లో గెలిచి వార్తల్లో నిలిచాడు. సైదాలి తన స్నేహితుడైన అబ్దుల్ మాజీద్‌తో కలిసి బిగ్ టిక్కెట్ కొంటున్నట్లు చెప్పాడు. గత 20 సంవత్సరాలుగా దాదాపు ప్రతి నెల సైదాలితో టిక్కెట్లు పంచుకుంటున్నానని, చాలా అదృష్టవంతుడని నమ్ముతున్నట్లు మాజీద్ అన్నాడు. తాము డ్రీమ్ 5,00,000 దిర్హామ్లు గెలుచుకున్నామని రిచర్డ్ మార్చి 1న తమకు చెప్పాడని తెలిపారు. 22/02/2022న విజేతలు టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. ఈ నెలలో బిగ్ టిక్కెట్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లందరికీ మార్చి 3న సాయంత్రం జరిగే లైవ్ డ్రాలో అద్భుతమైన AED 15 మిలియన్(మొదటి బహుమతి), AED 1 మిలియన్ (రెండవ బహుమతి) గెలుచుకునే అవకాశం ఉంటుంది. టిక్కెట్ కొనుగోలు, నిబంధనలు, షరతుల కోసం www.bigticket.ae ని చూడండి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







