సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ తో బహ్రెయిన్ సుల్తాన్ హమద్ భేటీ
- March 03, 2022
రియాద్: సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ తో బహ్రెయిన్ సుల్తాన్ హమద్ సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సమన్వయం, సంప్రదింపుల కొనసాగింపు, ఈ ప్రాంతంలోని పరిణామాలపై చర్చించడానికి కింగ్ సల్మాన్‌ను కలవడం పట్ల రాజు హమద్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కింగ్ సల్మాన్ హయాంలో సౌదీ అన్ని స్థాయిలలో సాధించిన నిరంతర అభివృద్ధిని, అంతర్జాతీయ సమాజంలో పొందిన విశిష్ట స్థానాన్ని ఆయన ప్రశంసించారు. గల్ఫ్, అరబ్ ప్రపంచం, ముస్లిం ప్రపంచంలోని సమస్యలకు సంబంధించి కింగ్ సల్మాన్ చేసిన ప్రయత్నాలను కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో సౌదీ అరేబియా పోషిస్తున్న వ్యూహాత్మక పాత్రకు రాజు హమద్ తన మద్దతును పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వానికి సౌదీ అరేబియా మూల స్తంభమని ఆయన నొక్కి చెప్పారు. అంతకుముందు కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్.. బహ్రెయిన్ రాజు హమద్ కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బహ్రెయిన్‌లోని కింగ్డమ్ రాయబారి ప్రిన్స్ సుల్తాన్ బిన్ అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్, వాణిజ్య, పెట్టుబడుల మంత్రి మాజిద్ అల్-కసాబీతో సహా ఇతర సౌదీ అధికారులు కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







