దుబాయ్ లో విదేశీ ఉద్యోగుల కోసం సేవింగ్ స్కీమ్

- March 03, 2022 , by Maagulf
దుబాయ్ లో విదేశీ ఉద్యోగుల కోసం సేవింగ్ స్కీమ్

దుబాయ్: దుబాయ్ ప్రభుత్వంలో విదేశీ ఉద్యోగుల కోసం సేవింగ్స్ స్కీమ్ ని ప్రారంభించారు. ఈ మేరకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వెల్లడించారు. ఆకర్షణీయమైన, సురక్షితమైన పెట్టుబడి అవకాశాలను అందించే అనేక అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) పర్యవేక్షించనుంది. "డీప్ డైవ్ దుబాయ్"లో బుధవారం జరిగిన దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో దుబాయ్ డిప్యూటీ రూలర్ షేక్ మక్తూమ్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సమక్షంలో ఈ స్కీమ్ ని ప్రకటించారు. ప్రభుత్వ రంగ సామర్థ్యాల నిరంతర అభివృద్ధిలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని, పౌరులు లేదా నివాసితులు అనే తేడా లేకుండా ఉద్యోగులందరికీ అవసరమైన మద్దతును అందిస్తుందని షేక్ హమ్దాన్ చెప్పారు. సేవింగ్స్ స్కీమ్ అనేది వివిధ రంగాలలో మరింత మంది ప్రతిభావంతులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులను ఆకర్షించే దిశగా ఒక కొత్త అడుగన్నారు. ఈ స్కీమ్ ని విధివిధానాలు, పర్యవేక్షించేందుకు త్వరలోనే ఓ ఎగ్జిక్యూటీవ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు హమ్దాన్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com