సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ తో బహ్రెయిన్ సుల్తాన్ హమద్‌ భేటీ

- March 03, 2022 , by Maagulf
సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ తో  బహ్రెయిన్ సుల్తాన్ హమద్‌ భేటీ

రియాద్: సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ తో బహ్రెయిన్ సుల్తాన్ హమద్‌ సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సమన్వయం, సంప్రదింపుల కొనసాగింపు, ఈ ప్రాంతంలోని పరిణామాలపై చర్చించడానికి కింగ్ సల్మాన్‌ను కలవడం పట్ల రాజు హమద్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కింగ్ సల్మాన్ హయాంలో సౌదీ అన్ని స్థాయిలలో సాధించిన నిరంతర అభివృద్ధిని, అంతర్జాతీయ సమాజంలో పొందిన విశిష్ట స్థానాన్ని ఆయన ప్రశంసించారు. గల్ఫ్, అరబ్ ప్రపంచం, ముస్లిం ప్రపంచంలోని సమస్యలకు సంబంధించి కింగ్ సల్మాన్ చేసిన ప్రయత్నాలను కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో సౌదీ అరేబియా పోషిస్తున్న వ్యూహాత్మక పాత్రకు రాజు హమద్ తన మద్దతును పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వానికి సౌదీ అరేబియా మూల స్తంభమని ఆయన నొక్కి చెప్పారు. అంతకుముందు కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్.. బహ్రెయిన్ రాజు హమద్‌ కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బహ్రెయిన్‌లోని కింగ్‌డమ్ రాయబారి ప్రిన్స్ సుల్తాన్ బిన్ అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్, వాణిజ్య, పెట్టుబడుల మంత్రి మాజిద్ అల్-కసాబీతో సహా ఇతర సౌదీ అధికారులు కూడా హాజరయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com