రష్యాకు బిగ్‌ షాక్..

- March 03, 2022 , by Maagulf
రష్యాకు బిగ్‌ షాక్..

యుక్రెయిన్: యుక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా… ఓవైపు చర్చలు అంటూనే.. మరోవైపు భీకర దాడులకు పాల్పడుతోంది.ఇక, అదే స్థాయిలో యుక్రెయిన్ నుంచి కూడా ప్రతిఘటన ఎదురవుతోంది రష్యా బలగాలకు.. ఇరు దేశాలకు చెందిన సైనికులతో పాటు.. ప్రజలు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు.. కేవలం సైనికులే కాదు.కీలక అధికారులు కూడా ప్రాణాలు కోల్పోవడం రష్యాకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.యుద్ధం మొదలై ఎనిమిది రోజులైనప్పటికీ యుక్రెయిన్ లో విధ్వంసం మాత్రం కొనసాగుతూనే ఉంది.. యుద్ధం మొదట్లో రష్యా ఆధిపత్యం చెలాయించినట్లు కనిపించినా ఆ తర్వాత యుక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు.దీంతో..యుక్రెయిన్ తో పాటు రష్యా కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.తాజాగా, ఈ యుద్ధంలో రష్యన్‌ మేజర్‌ జనరల్‌ హతమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.ఎనిమిదో రోజు యుద్ధంలో రష్యన్‌ మేజర్‌ జనరల్‌ అండ్రీ సుఖోవిట్‌స్కీ ప్రాణాలు విడిచినట్టు బెలారస్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.అయితే, దీనిపై రష్యన్‌ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com