ఫేక్ మెయిడ్ ఆఫీసుపై దాడి.. నలుగురు ఆసియన్లు అరెస్ట్

- March 05, 2022 , by Maagulf
ఫేక్ మెయిడ్ ఆఫీసుపై దాడి.. నలుగురు ఆసియన్లు అరెస్ట్

కువైట్: ఫేక్ మెయిడ్ కార్యాలయాలపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉక్కుపాదం మోపుతోంది.ఫేక్ ఆఫీసులపై దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ నకిలీ మెయిడ్(పనిమనిషి) కార్యాలయంపై దాడులు చేసింది. దీన్ని నడుపుతున్న నలుగురు ఆసియా వాసులను అదుపులోకి తీసుకుంది. వారు నిబంధనలను ఉల్లంఘించి కార్యాలయాన్ని నడుపుతున్నట్లు  అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పనిమనుషులు ఫర్వానియా గవర్నరేట్‌లో రోజువారీ కూలీ ఆధారంగా పనిచేస్తున్నారని, వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com