రష్యా, ఉక్రెయిన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధం: క్రౌన్ ప్రిన్స్
- March 05, 2022
రియాద్: ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి వీలుగా ఆ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ గురువారం చెప్పారు. ఈ మేరకు ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించేందుకు, భద్రత, స్థిరత్వాన్ని సాధించడానికి రాజకీయ పరిష్కారానికి అవసరమైన ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే చమురు మార్కెట్లపై ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావాన్ని తగ్గించేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రిన్స్ మరోసారి స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు, వివిధ రంగాల్లో వాటిని పెంపొందించే మార్గాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీతో కూడా క్రౌన్ ప్రిన్స్ మాట్లాడారు. సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించడానికి సంసిద్ధతకు తెలియజేశారు. రాజకీయంగా సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించిన అన్ని అంతర్జాతీయ ప్రయత్నాలకు సౌదీ అరేబియా మద్దతుగా ఉంటుందని తెలిపారు.మానవతా దృక్పథంతో ఉక్రేనియన్ సందర్శకులు, పర్యాటకులు, సౌదీలోని నివాసితులకు వీసాల గడువును మూడు నెలల పాటు పొడిగించనున్నట్లు ప్రిన్స్ ప్రకటించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







