143 మంది ప్రభుత్వ సిబ్బంది అరెస్టు
- March 05, 2022
రియాద్: లంచం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ ఆరోపణలపై మొత్తం 143 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను సౌదీ అరేబియా పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) అరెస్టు చేసింది. గత నెలలో వివిధ ప్రభుత్వ శాఖల్లో నజాహా చేపట్టిన 5072 తనీఖీల్లో 544 మంది అనుమానితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసి వారిలో 143 మందిని అరెస్టు చేసినట్లు నజాహా శుక్రవారం తెలిపింది. అరెస్టైన వారిలో రక్షణ, హోం, హెల్త్, న్యాయం, ఎడ్యుకేషన్, మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహ మంత్రిత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ప్రజా ధనాన్ని రక్షించడానికి, పరిపాలనా అవినీతికి చెక్ పెట్టేందుకు అవినీతి అధికారుల సమాచారం అందించాలని ప్రజలను నజాహా కోరింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







