భారత్ కరోనా అప్డేట్
- March 05, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మరణాలు భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 5,921 కొవిడ్ కేసులు బయటపడగా.. 11,651 మంది కోలుకున్నారు. 289 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 63,878గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.దేశంలో మొత్తం కేసులు 4,29,45,284గా వున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా మొత్తం మరణాలు 5 లక్షల14 వేల 878గా వున్నాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 63,878 వున్నాయని కేంద్రం తెలిపింది. కరోనా నుంచి కోలుకున్నవారు 4,23,78,721గా వున్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శర వేగంగా జరుగుతోంది. శుక్రవారం మరో 24,62,562 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 178 కోట్ల 55 లక్షల 66,940కు చేరింది.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో రోజుకి 3 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. గత 15 రోజులుగా కేసుల్లో భారీగా తగ్గుదల నమోదవుతోంది. గత వారం రోజుల్లో రోజుకి 10 వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగడంతో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కరోనా నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







