అమెరికా సేనేట్‌లో ప్రసంగం చేయడానికి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఆహ్వానం
- March 05, 2022
వాషింగ్టన్: అమెరికా సేనేట్‌లో ప్రసంగం చేయడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఆహ్వానం వచ్చింది. జూమ్ ద్వారా జరిగే సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇటీవల జెలెన్స్కీతో టచ్‌లో ఉన్నారు.యుక్రెయిన్ పై రష్యా దాడికి దిగిన నాటి నుంచి ఆ దేశానికి బైడెన్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. సేనేట్‌లో ఉన్న సభ్యులందరితో జెలెన్స్కీ మాట్లాడనున్నారు.యుక్రెయిన్ కు చెందిన అంబాసిడర్ ఒక్సానా మర్కరోవా గడిచిన వారం సేనేట్ సభ్యుల్ని కలిశారు. ఈ నేపథ్యంలో తమ దేశానికి అత్యధిక స్థాయిలో సరఫరాలు కావాలని ఆమె వేడుకున్నారు. మరో వైపు యుక్రెయిన్, రష్యా మధ్య మూడో దఫా చర్చలు జరగనున్నాయి.
యుక్రెయిన్ కు, జెలెన్స్కీకి మద్దతుగా యూరోప్‌లో భారీ ప్రదర్శనలు జరుగుతున్నాయి.వేలాది మంది నిరసనకారులను ఉద్దేశించి జెలెన్స్కీ వీడియో సందేశం వినిపించారు. జార్జియా రాజధాని టిబ్లిసి, చెక్ రాజధాని ప్రాగ్లో జరిగిన ప్రదర్శనకు జెలెన్స్కీ వీడియోను ప్లే చేశారు. ఫ్రాంక్ఫర్ట్, విల్నియూస్, లియాన్, బ్రాటిస్లేవా నగరాల్లో జరిగిన ప్రదర్శనల్లోనూ ఆయన వీడియోను వినిపించారు. లిస్బన్, లూసెర్న్, లండన్, సియోల్, జకర్త, లా పాజ్ నగరాల్లోనూ యుక్రెయిన్ కు మద్దతుగా ప్రదర్శనలు జరిగాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







