తెలంగాణ గల్ఫ్ సమితి గుర్తింపు కార్డ్ ఆవిష్కరణ..

- March 05, 2022 , by Maagulf
తెలంగాణ గల్ఫ్ సమితి గుర్తింపు కార్డ్ ఆవిష్కరణ..

దోహా: తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ 2021 తో పదవ వసంతంలో అడుగు పెట్టిన సంధర్భంగా సభ్యులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు.గత 10 సంవత్సరాల నుంచి కార్మికులకు అండగా ఉంటూ కష్టాలలో తోడై , సాంస్కృతిక కార్యక్రమాలు , పండుగ సంబరాలు చేస్తూ సభ్యుల అందరి సహాయంతో విజయవంతంగా ముందుకు వెళ్తున్న తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులకు గుర్తింపు కార్డ్  ప్రారంభోత్సవం చేయడం జరిగింది.

కరోన మహమ్మారి వలన గత 2 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా కలవని,నూతనంగా చేరిన సభ్యలను ప్రత్యక్షంగా ఆహ్వానించి వారి సమక్షంలో ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ICC అద్వైసిర్ చైర్మన్ కోడూరి శివ ప్రసాద్ ,ICC ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, ICC ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్, ICBF మెడికల్ & హెల్ప్ హెడ్ రాజనీమూర్తి, TJQ అధ్యక్షురాలు నందిని అబ్బాగౌని, TGS అద్వైసిర్ చైర్మన్ శ్రీధర్ అబ్బాగౌని,ICC యూత్ వింగ్ లీడర్ శోభన్ గౌడ్ మరియు తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గ సభ్యులు, పాల్గొన్నారు.
తెలంగాణ గల్ఫ్ సమితి లో చేరాలనుకునేవారు కింది నంబర్లను సంప్రదించగలరు.
77212911,66732459,33248542,30627009..

--రాజ్ కుమార్ వనం బత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com