కమర్షియల్ వీసాలను హోల్డ్ లో పెట్టిన కువైట్
- March 06, 2022
కువైట్:అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రకాల విజిట్ వీసాలు, ముఖ్యంగా ప్రవాస కుటుంబాలకు జారీ చేయాలని యోచిస్తున్న తరుణంలో.. కమర్షియల్ విజిట్ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. అరబ్ దేశ పౌరులు అనేక మంది భిక్షాటన చేస్తూ పట్టుబడటం.. అలాగే పవిత్ర రంజాన్ మాసానికి ముందే కువైట్‌కు చాలామంది చేరుకున్నారని అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒరకు తెలిపారు. విజిటర్ వీసా జారీ చేయడానికి ముందు కువైట్‌లో ఆమోదించబడిన వ్యాక్సిన్‌ల ను తీసుకున్నట్లు నిర్ధారించుకునే విధానాలను అప్డేట్ చేయాల్సి ఉందన్నారు. రెసిడెన్సీ వ్యవహారాల విభాగం విజిట్ వీసాలను జారీ చేస్తుందని, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), ఎయిర్‌లైన్స్ తప్పనిసరిగా వ్యాక్సిన్ ధృవీకరణ పత్రాలను చెక్ చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే దేశంలో కొవిడ్ వ్యాప్తి తగ్గుదల నేపథ్యంలోమంత్రిత్వ శాఖ త్వరలో కొత్త నిబంధనలను ప్రకటించాలని భావిస్తుందని, ఆ తర్వాతే వీసాల జారీ ఉండే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







