రైళ్లలో హాఫ్ టికెట్కు బర్త్ రిజర్వేషన్ లేదు..
- March 31, 2016
రైళ్లలో ప్రయాణించే ఐదునుంచి పన్నెండేళ్ల వయస్సున్న పిల్లల కోసం ప్రత్యేకంగా బెర్తులు రిజర్వ్ చేసుకోవాలంటే వారికి కూడా పెద్దవారితో సమానంగా పూర్తి టికెట్ కొనాల్సిందే. హాఫ్ టికెట్ కొంటే వారికి బెర్తులు కేటాయించరు. ఈ విధానం నేటినుంచి అమల్లోకి వచ్చింది. 5నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులు రైళ్లలో ప్రయాణించడానికి రైల్వే శాఖ టికెట్ ఛార్జీలో సగం మాత్రమే వసూలు చేస్తుంది.దీనిని మనం హాఫ్ టికెట్ అంటూ వ్యవహరిస్తుంటాం. ప్రతియేటా సుమారు రెండున్నర కోట్ల మంది చిన్నారులు హాఫ్టికెట్తో రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు అంచనా. ఇన్నాళ్లూ తమ పిల్లలతో ఊళ్లకు వెళ్లే తల్లిదండ్రులు వారికి హాఫ్ టికెట్ తీసుకున్నా ప్రత్యేకంగా బెర్తులు కేటాయించేవారు. ఈ విధానానికి రైల్వే శాఖ స్వస్తి చెప్పింది. ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో ప్రయాణీకుల ఛార్జీలు పెంచని కారణంగా ఎదురయ్యే లోటును భర్తీ చేసుకోవడానికి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







