ట్రంప్ కు తప్పిన ప్రమాదం
- March 10, 2022
అమెరికా: యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రమాదం తప్పింది. ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం కలగటంతో ఓర్లియాన్స్ అధికారులు అత్యవరసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. మెక్సికో గగనతలం మీదుగా ప్రయాణిస్తుండగా , ఒక్కసారిగా ఇంజిన్ ఆగిపోవటంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు తెలిసింది. ఈ ఘటన గతవారం జరిగినప్పటికీ విషయం ఆలస్యంగా ఇపుడు బయటకు వచ్చింది.
ఇదిలా ఉండగా, ఈ విషయాన్ని అక్కడి ఒక వార్తా సంస్థ ముందుగా ప్రచురించింది. ఇపుడు , సంబంధిత అధికారి సైతం ధృవీకరించినట్టు సమాచారం . కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలను భద్రతా కారణాల రీత్యా వెల్లడించలేదు. న్యూ ఓర్లియాన్స్లో గత శనివారం జరిగిన రిపబ్లికన్ నేషనల్ కమిటీ డోనార్ రిట్రీట్‌కు హాజరై.. తిరిగి ఫ్లోరిడా ఎస్టేట్‌కు వస్తుండగా రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంజిన్ ఆగిపోయింది. ఆ సమయంలో ట్రంప్ తో పాటు ఆయన సలహాదారులు, నిఘా అధికారులు ఆయనతో పాటు ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







