హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ భవనం.. భూమిపూజ చేసిన చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ
- March 12, 2022
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ భూమిపూజ చేశారు.
భవనం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలో 3.7 ఎకరాల భూమిని ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్ లో అంతర్ జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం కొనసాగుతోందన్నారు. భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఎంతో విలువైన భూమిని గచ్చిబౌలిలో కేటాయించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. 50 కోట్ల రూపాయలు నిర్మాణానికి కేటాయించడం ముందడుగు అన్నారు. అంతర్ జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం వల్ల హైదరాబాద్ కు మరింత పేరు వస్తుందన్నారు. సింగపూర్ మాదిరిగా హైదరాబాద్ కేంద్రం కూడా ప్రపంచ ఖ్యాతి సంపాదించాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఈ సమయానికి భవన నిర్మాణం పూర్తి కావాలని ఆశిస్తున్నామని తెలిపారు.
ఈకార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సుప్రీంకోర్టు జడ్జీలు హిమా కోహ్లీ, నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీజే సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







