ఒమన్ లో 85 శాతం తగ్గిన వీసా ఫీ

- March 14, 2022 , by Maagulf
ఒమన్ లో 85 శాతం తగ్గిన వీసా ఫీ

ఒమన్: ప్రవాస లేబర్ రిక్రూట్ కోసం లైసెన్స్ ల జారీ, పునరుద్ధరణ కోసం వీసా ఫీ లను 85 శాతానికి పైగా తగ్గించారు. ఈ మేరకు ప్రభుత్వ సేవల విభాగం ప్రకటించింది. కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఒమనైజేషన్ రేట్ల నిబంధనల ప్రకారం నడిచే కంపెనీల్లో పనిచేసేందుకు వచ్చే ప్రవాసుల వీసా ఫీ లను 89 శాతం వరకు తగ్గించారు. ప్రవాస కమర్షియల్ మ్యాన్ పవర్ రిక్రూట్‌మెంట్ కోసం లైసెన్సుల జారీ, పునరుద్ధరణకు ఫీ లు ఇలా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ OMR 2001 నుండి OMR 301 వరకు ( రెండు సంవత్సరాలకు) తగ్గించగా, ఒమనైజేషన్ కు మరో OMR 211. సెకండ్ క్లాస్ OMR 601-1001 నుండి OMR 251, ఒమనైజేషన్ కు మరో OMR 176. థార్డ్ క్లాస్ OMR 301-361 నుండి OMR 201, ఒమనైజేషన్ కు మరో OMR 141. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com