ఈనెల 24 నుంచి హైదరాబాద్ లో ఎయిర్‌షో
- March 14, 2022
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అందరూ ఎదురుచూస్తున్న ఎయిర్ షో త్వరలోనే ప్రారంభం కానుంది. ఈనెల 24 నుంచి వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఎయిర్ షోను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టు వేదికగా పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్లు, హెలికాప్టర్లు నగరవాసులను కనువిందు చేయనున్నాయి.నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శనలు కొనసాగనున్నాయి. కరోనా కారణంగా నాలుగేళ్ల విరామం అనంతరం ఈ ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రదర్శనలో దాదాపు 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఆరువేలకు పైగా ట్రేడ్ విజిటర్స్, 50వేల మంది సందర్శకులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రదర్శనలను వీక్షించాలని భావించేవారు వింగ్స్ ఇండియా వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించామని అధికారులు తెలిపారు. తొలి మూడురోజులు వ్యాపారవేత్తలను అనుమతిస్తారు.చివరిరోజు సాధారణ సందర్శకులు రూ.500 చెల్లించి ప్రదర్శనలను వీక్షించవచ్చు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







