స్మశానాల్లో అంత్యక్రియల్ని ఫోటోలు తీస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే!
- March 15, 2022
కువైట్: కువైట్ మునిసిపాలిటీ - డైరెక్టర్ ఆఫ్ ఫ్యునరల్ డిపార్టుమెంట్ డాక్టర్ ఫైసల్ అల్ అవాదీ వెల్లడించిన వివరాల ప్రకారం స్మశానాల్లో ఎవరైనా ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తే 5,000 కువైటీ దినార్ల జరీమానా విధించడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులు, అథ్లెట్లు, సెలబ్రిటీలు వంటివారి ఇంట్లో విషాద ఘటన జరిగినప్పుడు, అంత్యక్రియల సమయంలో స్మశానాల వద్ద అకారణంగా గుమికూడేవారి సంఖ్య పెరగడం, ఫొటోలు, వీడియోలు తీయడం వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా మారుతోంది. స్మశానాల్ని నిర్దేశిత పనుల నిమిత్తం తప్ప, ఇతర కార్యక్రమాలకు వినియోగించకూడదు. అలా వినియోగించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఆయా చట్టాలు కల్పిస్తున్నాయి. 2,000 దినార్లకు తగ్గకుండా 5,000 దినార్లకు మించకుండా ఉల్లంఘనలకు జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం