అన్ని గవర్నరేట్లలో ఎల్ఎంఆర్ఎ సంయుక్త తనిఖీలు

- March 16, 2022 , by Maagulf
అన్ని గవర్నరేట్లలో ఎల్ఎంఆర్ఎ సంయుక్త తనిఖీలు

బహ్రెయిన్: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), నేషనాలిటీ, పాస్‌పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్) సాయంతో అన్ని గవర్నరేట్లలోని పలు పని ప్రాంతాల్లో తనిఖీల్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనల్ని గుర్తించారు. పని ప్రాంతంలో మంచి వాతావరణం దిశగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. నిబంధనల్ని ఖచ్చితంగా పాటించేలా ఈ తనిఖీలు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు. పని ప్రదేశంలో ఉల్లంఘనలు లేకపోతే, అది సమాజ ప్రగతికి దోహదం చేస్తుంది. భద్రత, అలాగే ఆరోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com