200కి పైగా ఇన్వెస్టర్లకు లాంగ్ టైమ్ వీసాలు
- March 17, 2022
ఒమన్: అక్టోబరు 2021లో ఇన్వెస్టర్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ (IRP) ప్రారంభించినప్పటి నుండి నేటి వరకు వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ, రాయల్ ఒమన్ పోలీస్ (ROP) సహకారంతో వివిధ దేశాల 217 జాతీయులకు ఇన్వెస్టర్ రెసిడెన్సీ కార్డులను జారీ చేసింది. 10 ఏళ్ల కేటగిరీకి 142 కార్డులు, 5 ఏళ్ల కేటగిరీకి 73 కార్డులు, పదవీ విరమణ పొందిన వారి కేటగిరీలో 2 కార్డులు చొప్పు జారీ చేశారు. ఒమన్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు ఇన్వెస్టర్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ కింద విదేశీ ఇన్వెస్టర్లు, పదవీ విరమణ పొందిన వారికి సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో లాంగ్ టైం రెసిడెన్సీ అవకాశాన్ని కల్పిస్తోంది. రెసిడెన్సీ వ్యవధి 5 లేదా 10 సంవత్సరాలకు ఉంటుంది. అనంతరం రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ ఇన్వెస్టర్ రెసిడెన్సీ కార్డును పొందేందుకు, సంబంధిత మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని పెట్టుబడి సేవల కేంద్రం ద్వారా అప్లై చేసుకోవాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల