పోలీసులపై దాడికి పాల్పడితే 5 ఏళ్ల జైలుశిక్ష
- March 22, 2022
కువైట్: విధినిర్వహణలో ఉన్న పోలీసుపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇటీవలి కాలంలో పోలీసు అధికారులపై పదే పదే దాడులు జరిగిన సంఘటనలు నమోదవడంతో మంత్రిత్వ శాఖ స్పందించింది. పోలీసుల విధులకు అంతరాయం కలిగించే ఉద్దేశ్యంతో అతనిపై దాడి చేసినట్లయితే 5 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 5,000 దీనార్లు ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. మాటలతో దూషించడం లేదా అవమానించడం లాంటి చర్యలకు పాల్పడితే రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష, 3,000 దీనార్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని గుర్తు చేసింది. పబ్లిక్ ఆర్డర్‌ను పరిరక్షించడానికి సిటిజన్స్/రెసిడెంట్స్ కట్టుబడి ఉండాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







