చోరీ చేస్తూ దొరికిన ఎయిర్‌పోర్ట్ పోర్టర్
- March 22, 2022
యూఏఈ: దుబాయ్ విమానాశ్రయంలో 29 ఏళ్ల పోర్టర్.. ప్రయాణీకుల బ్యాగ్ నుండి మొబైల్ ఫోన్‌లను దొంగిలించిన ఆరోపణలపై మూడు నెలల జైలు శిక్ష, Dh28,000 జరిమానా విధించారు. జైలు శిక్ష తర్వాత ప్రవాసిని బహిష్కరించాలని దుబాయ్ క్రిమినల్ కోర్టు అధికారులను ఆదేశించింది. పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 2021లో ఒక ఆసియా ప్రయాణీకుడు తన స్వదేశానికి వెళ్లిన తర్వాత తన సూట్‌కేస్‌లో ఆరు మొబైల్ ఫోన్లు కన్పించలేదు. దాంతో అతడు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలించి పోర్టర్ ఆ మొబైల్ ఫోన్లను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు అనుమానితుడి ఇంటిని సోదా చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారెంట్ జారీ చేసింది. విచారణలో, తాను మొబైల్ ఫోన్‌లను దొంగిలించానని, వాటిలో ఐదింటిని మొబైల్ ఫోన్ షాపులో 10,000 దిర్హామ్‌లకు విక్రయించినట్లు పోర్టర్ అంగీకరించాడు. 5,000 దిర్హామ్‌లతో విలువైన సన్‌గ్లాసెస్, కెమెరా, మొబైల్ ఫోన్, వైర్‌లెస్ హెడ్‌సెట్, ఇతర ఉపకరణాలను కొన్నట్లు విచారణలో నిందితుడు చెప్పాడు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







