తెలంగాణ: హైకోర్టుకు 10 మంది కొత్త న్యాయమూర్తులు..
- March 23, 2022
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు మరో 10 మంది న్యాయమూర్తులు రానున్నారు. కొత్తగా పది జడ్జీలను నియమిస్తూ… రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం… తెలంగాణ హైకోర్టుకు 12 మంది నూతన న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేసింది. న్యాయవాదుల నుంచి ఏడుగురిని, జ్యుడిషియల్ ఆఫీసర్ల నుంచి ఐదుగురిని జడ్జిలుగా నియమించడానికి కొలీజియం నిర్ణయం తీసుకుంది.
కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో న్యాయవాదుల నుంచి కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్వీ శ్రావణ్‌కుమార్ ఉన్నారు. న్యాయాధికారుల నుంచి జి.అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్ దేవరాజ్ నాగార్జున్ ఉన్నారు. వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ కుమార్ శర్మ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా, తెలంగాణ హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులు పనిచేయడానికి అవకాశం ఉండగా ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు. కొత్తగా నియమితులైన 10 మందితో కలిపి… మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరనుంది. మరో 13 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్‌పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్







